Keir Starmer: పుతిన్ ఆటలు సాగనివ్వం -బ్రిటన్ ప్రధాని 1 y ago
ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సీరియస్గా తీసుకోవట్లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పుతిన్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రష్యా అధ్యక్షుడు కాల్పుల విరమణను ఆలస్యం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.